Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

Amaravati, May 12: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో ఏకంగా 21,452 మంది కరోనా (AP Coronavirus) బారిన పడ్డారు. ఇదే సమయంలో 89 మంది కరోనా వల్ల మృతి (Covid Deaths) చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు (2,927) నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19,095 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,44,386 కేసులు నమోదు కాగా... 11,38,028 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 8,988 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో 8 మంది మరణించగా, విశాఖపట్నంలో 11 మంది, తూర్పుగోదావరిలో 9, గుంటూరులో 8, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. ప్రకాశంలొ తొమ్మది, నెల్లూరు 8, కృష్ణాలో 9, శ్రీకాకుళంలో 7 మంది మరణించారు. అలాగే కర్నూలులో 5, వెస్ట్ గోదావరిలో ముగ్గురు చొప్పున మరణించారు. అనంతపురంలో 6 కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,988కి పెరిగింది.

విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, వాటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దండి, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లకు లైన్ క్లియర్ అయింది. రెండు రోజుల నుంచి రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర అంబులెన్సులను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమతి ఇస్తున్నారు. నిన్నటి వరకు ఆస్పత్రి నుంచి ఫోన్ చేయించాలని రోగుల బంధువులను తెలంగాణ పోలీసులు కోరారు.

నిన్న రాత్రి వరకు అవే ఆంక్షలు కొనసాగాయి. తెలంగాణ హైకోర్టు ఆగ్రహంతో బుధవారం ఉదయం నుంచి ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. కాగా తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా వాహనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.