Coronavirus Outbreak: (Photo-IANS)

Amaravati, August 13: ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 55,692 కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌గా 9,996 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Coronavirus Report) 2,64,142కు చేరుకుంది. తాజాగా 9,499 మంది క‌రోనాను జ‌యించి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం రిక‌వ‌రీ కేసుల కేసుల సంఖ్య (Recoveries) 1,70,924గా ఉంది. క‌రోనా కార‌ణంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 82 మంది ప్రాణాలు (Covid-19 Deaths) కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2378కు చేరుకుంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్‌ ప‌రీక్ష‌ల సంఖ్య 27 ల‌క్ష‌లు దాటింది. ఈ నెల 13 నాటికి మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య‌ 27,05,459కు చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 963 కరోనా పాజిటివ్ కేసులు, విశాఖపట్నం జిల్లాలో 931, అనంతపురం 856, పశ్చిమ గోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకులం 425, కృష్ణా జిల్లాలో 330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు, ఒంగోలు జీజీహెచ్‌‌లో అమానవీయ ఘటన, వీడియోని షేర్ చేసిన చంద్రబాబు, స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు

మరణాల విషయానికి వస్తే.. తూర్పుగోదావరిలో 10 మంది, గుంటూరులో 10, అనంతపురంలో 8 మంది, కడపలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 6, నెల్లూరులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 6, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 5, కృష్ణ జిల్లాలో ఒకరు కరోనా వల్ల మరణించారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2378కి చేరింది.

AP Corona Report

కరోనా మానవత్వాన్ని నిలువునా చంపేస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకటరామయ్య(73) శనివారం రాత్రి తన ఇంటిముందు పడుకుని ఉండగా పక్కంటికి చెందిన ఆవు అతని గుండెలపై కాలుపెట్టి తొక్కింది. దీంతో అతని పక్కటెముకలు విరిగి అస్వస్థకు గురయ్యాడు. బాధితునికి వైద్యం చేయించాలని ఆవు యజమానిని బాధిత కుటుంబ సభ్యులు అడిగినా పట్టించుకోలేదు .ఆదివారం ఉదయం అతని కుమార్తె హేమలత తండ్రిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. వారు అతన్ని పరిశీలించి స్కానింగ్‌ చేయాలని, తమవద్ద స్కానింగ్‌ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపించారు.

బుధవారం ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో మళ్లీ ఆటోలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని భావిస్తుండగా వృద్ధుడు ఆటోలోనే ప్రాణం వదిలాడు. దీన్ని గమనించిన ఆటోడ్రైవర్‌ శవాన్ని రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. అయ్యా మా తండ్రి ఆవుతొక్కి చనిపోయాడు. కరోనా కాదు. సాయం చేయండి’ అని శవం ముందు మృతుని కుమార్తె ఆర్తనాదాలు చేసినా అక్కడి మనుషుల మనసులు కరుగలేదు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.