AP Secretariat Employees (Credits: X)

Vijayawada, Nov 29: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి (AP Secretariat employees) అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, (Venkatrami Reddy) పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా (Alcohol supply) చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు (Excise Police) దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌ లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్‌’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్

ఎందుకు?

త్వరలో జరుగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు, విందు పార్టీ (Drink Party) ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు మందు, విందు ఏర్పాటు చేయడంతో అతనిపై ఎక్సైజ్‌ శా‌ఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా

మొదటి నుంచి ఆరోపణలు

వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌ లో ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు వెంకట్రామిరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.