AP Skill Development (Photo-File Image)

Hyd, Dec 19: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో (AP Skill Development Scam) మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ విచారణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు నగరంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆఫీస్‌కు ఆయన విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటలపాటు ఆయన్ని (Former IAS Officer K Lakshminarayana) ఈడీ విచారించింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ గా ఆయన ఇంతకుముందు పదవిలో ఉన్నారు. ఆపై విచారణ పూర్తికాగానే.. మీడియా కంట పడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఇదే స్కాంలో విచారణకు హాజరైన పలు కంపెనీల ప్రతినిధులను సైతం ఈడీ (ED)దీర్ఘంగా విచారించింది.

ఏపీలో మాదక ద్రవ్యాలు అనే పదం ఎక్కడా వినిపించకూడదు, నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చండి, ఎస్‌ఈబీ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందన్న అభియోగాలు నమోదు అయ్యాయి.అప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ కొనసాగారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో సీమెన్స్‌ సంస్థ రూ.3,350 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త జాతీయ రహదారి, కల్వకుర్తి నుంచి జమ్మలమడుగు వరకు, 255 కి.మీ.మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.370 కోట్లు కాగా, ప్రభుత్వ వాటాలోని రూ.370 కోట్లలో రూ.241 కోట్లు దారి మళ్లించారని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో నిర్వహించిన ఫోరెనిక్స్‌ ఆడిట్‌లోనిర్థారణ అయ్యింది. నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ ద్వారా జీఎస్టీకి గండికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, డైరెక్టర్లు సహా పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.