AP CM Jaganmohan Reddy & Telangana CM KCR Meeting at Pragathi Bhavan | Official Photo

Amaravati, August 24: కృష్ణా, గోదావరి నదీ జల వివాదాలకు (water sharing issues) సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన ఈ నెల 25న నిర్వహించాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏసీ మల్లిక్‌ లేఖలు రాశారు.

అనుకూల పరిస్థితులు లేకపోవడంతో భేటీని ( Apex Council meeting) వాయిదా వేస్తున్నామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే చెబుతామని ఆ లేఖలో వెల్లడించారు. అయితే నాలుగు రోజుల కిందట కోవిడ్‌ పరీక్షలో తనకు పాజిటివ్‌గా తేలిందని కేంద్ర జలశక్తిమంత్రే స్వయంగా ప్రకటించడంతో పాటు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు, త్వరలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం, అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సూచనలు..

తెలంగాణలో వచ్చే నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మరో 21వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.జనార్దన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఎరువులు, రసాయనాల కేంద్ర మంత్రి సదానందగౌడను కలిశారు. కోటాకు అనుగుణంగా రాష్ట్రానికి రావాల్సిన యూరియా, ఇతర ఎరువులను వెంటనే పంపించాలని కోరారు. తాజాగా రాష్ట్రానికి వచ్చిన దానితో కలిపి 1.03లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌ ఉందన్నారు.