YS Jagan Mohan Reddy (Photo-Twitter)

VJY, Feb 28: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ( Jagan Govt) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) చొరవతో ఈ నెల 24న ఉత్తర్వులు విడుదలయ్యాయి. సవరించిన కొత్త పీఆర్‌సీ (PRC) ప్రకారం మార్చి 1వ తేదీన వారంతా వేతనాలు అందుకోనున్నారు. దీనికితోడు పదోన్నతి పొందిన నాటి నుంచి వారికి రావాల్సిన వేతన బకాయిలు కూడా కొత్త పీఆర్‌సీ ప్రకారం చెల్లించాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తగ్గని జగన్ మేనియా, 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, మిగతా నాలుగు స్థానాలుకు పోటీ, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో..

ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు (APSRTC Employess)ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది.గతంలో డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. వీరందరికీ గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్‌సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి.

పెట్టుబడులే ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, ప్రారంభ సెషన్‌లో స్పీచ్ ఇవ్వనున్న బిజినెస్ టైకూన్స్

సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్‌సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో 2,096 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్‌ డీఎంలు, 148 మంది గ్రేడ్‌–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్‌–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్‌ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్‌లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్‌వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు.