APSRTC Buses. (Photo Credit: PTI)

Amaravati, Dec 19: సంక్రాంతి పర్వదినాన ప్రయాణికులకు ఏపీఎస్‌‌ఆర్టీసీ (APSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని (Sankranti festival) ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఏపీ నుంచి తెలంగాణకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది. తెలంగాణకు 1,251 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ పేర్కొంది. అలాగే ఇతరు రాష్ట్రాలకు కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ స్పష్టం చేసింది

ఏపీఎస్‌‌ఆర్టీసీ (Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) మొత్తం 3607 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్) కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 2021 జనవరి 8వ తేదీ నుంచి 13 వరకూ పొరుగు రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ప‍్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

రైళ్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో తెలియదు, కరోనా దెబ్బకు భారీగా ఆదాయాన్ని కోల్పోయాం, గూడ్స్ ద్వారా రికవరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం, కీలక విషయాలను వెల్లడించిన రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1251 బస్సులు నడుస్తాయని చెప్పారు. ఇక బెంగళూరు నుంచి 433, చెన్నై నుండి 133 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201, విశాఖకు 551 బస్సులు నడపుతారు. అలాగే అంతర్గతంగా వివిధ జిల్లాల మధ్య 1038 ప్రత్యేక బస్సులు తిరుగుతాయి.