Ayesha Meera Re-Postmortem: 12 ఏళ్ల తరువాత..,ఆయేషా మృతదేహానికి నేడు రీపోస్ట్‌మార్టం, హైకోర్టు ఆదేశాలతో సీబీఐ సంచలన నిర్ణయం, రీ-పోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించనున్న అధికారులు
Ayesha Meera Re Postmortem cbi-to-re-postmortem-ayesha-meera-dead-body-today (Photo-ANI)

Amaravathi, December 14: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన  ఆయేషా మీరా(Ayesha Meera) హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్‌మార్టం (Ayesha Meera Re Postmortem) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే సీబీఐ(CBI) అధికారులు తెనాలిలోని ఆయేషాను ఖననం చేసిన స్మశానానికి వచ్చారు.

దాదాపు 12 సంవత్సరాల క్రితం విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా అనే ఫార్మశీ విద్యార్థిని లైంగికదాడి, హత్యకు(Ayesha Meera rape and murder) గురైంది. ఈ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు  చెలరేగాయి. ఇక రాష్ట్రంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్పట్లో పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో వారు సత్యం బాబు( Satyam Babu) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే విచారణ అనంతరం కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత కోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది.

ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషని మాజీ మంత్రి కోనేరు రంగారావు కొడుకు, హాస్టల్ వార్డెన్, మరికొందరిపై ఆయేషా తల్లిదండ్రులు మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్నారు. కాాగా ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున, తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి పెద్ద సవాల్​గా మారింది. ఈ నేపథ్యంలోనే రీ పోస్ట్‌మార్టం చెయ్యాలని అధికారులు భావించారు.

ANI Tweet

ఇందులో భాగంగా ఆయేషాను ఖననం చేసిన ప్రదేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని అక్కడకి ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మత పెద్దలు, కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించి అనుమతి ఇచ్చారు. రీ-పోస్ట్ మార్టం మొత్తాన్నీ వీడియో ద్వారా చిత్రీకరించబోతున్నారు. డెడ్ బాడీ డీఎన్ఎ‌ DNA వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఆయేషా మీరా తల్లిదండ్రుల నుంచీ రక్త నమూనాలు, DNA వివరాల్ని సీబీఐ సేకరించింది. తద్వారా పూర్తి ఆధారాల్ని సేకరించేందుకు సీబీఐ రెడీ అవుతోంది.

కాగా ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు ముస్లిం మతపెద్దలు మొదట అంగీకరించలేదు. దీంతో సీబీఐ కోర్టు నుంచే పర్మిషన్ తెచ్చుకుంది.

ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్య కేసును కొన్నిరోజుల కిందట సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు (High Court)ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయేషా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చి శిక్షించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆమె భౌతిక కాయానికి రిపోస్టుమార్టం చేయబోతోంది.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పోలీసులు సరిగా దర్యాప్తు చెయ్యలేదని ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపించాయి.