Lanka Dinakar Suspended From BJP (Photo-ANI)

Amaravati, Oct 20: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నియమావళి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాలు, నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత లంకా దినకర్‌ను (Lanka Dinakar Suspended From BJP) ఆ పార్టీ షాకిచ్చింది. పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పాల్గొంటున్నారని పార్టీ సీరియస్ అయ్యింది.

గతంలో జారీచేసిన షోకాజ్‌ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే.. మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొన్నాంటున్నారని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును (BJP AP president Somu Veerraju) ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ విధానపరమైన నిర్ణయాలపై ఎలాంటి సమాచారం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొన్ని చర్చించవద్దని ఇంతకుముందు లంకా దినకర్‌కు షోకాజు నోటీసులు జారీచేసింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తన ఎలాంటి మార్పురాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహించిన అధిష్టానం వేటు వేసింది.

సీఎం జగన్ క్రిస్టియన్ అయితే నిరూపించండి, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? పిటిషనర్‌ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, ఏపీ సీఎం మతం ఏంటో చెప్పాలని పిటిషన్

గతంలో టీడీపీలో కొనసాగిన లంకా దినకర్‌ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్లు దినకర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.