COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravathi, May 2: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 62 మంది కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరింది. ఇందులో ఇప్పటివరకు 441 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 33 మంది చికిత్స పొందుతూ మరణించారు. అయితే నిన్న కొత్తగా కోవిడ్ మరణాలేమి నమోదు కాలేదు, ప్రస్తుతం ఏపీలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో జిల్లాల నుంచి అందిన రిపోర్ట్స్ మేరకు అత్యధికంగా కర్నూల్ జిల్లా నుంచి 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లా నుంచి 12, నెల్లూరు నుంచి 6, అనంతపూర్ 4, కడప 4, విశాఖపట్నం జిల్లాల నుంచి 4 చొప్పున కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి 3, గుంటూరు 2, మరియు ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఒక్కో కేసు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 5943 సాంపిల్స్ ని పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

status of positive cases of #COVID19 in Andhra Pradesh

దేశంలో కోవిడ్-19 తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మే 4వ తేదీ నుండి ప్రారంభమయ్యే మూడో ఫేజ్ లాక్‌డౌన్ మే 17 వరకు అమల్లో ఉండనుంది. అయితే వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లుగా విభజించి కేంద్రం మరికొన్ని సడలింపులను ప్రకటింది.  భారతదేశంలో 37 వేలు దాటిన కోవిడ్-19 బాధితులు, 12 వందలు దాటిన కరోనా మరణాలు

ప్రస్తుతం ఏపీలో రెడ్ జోన్‌ పరిధిలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం ఉన్నాయి. ఒక్క కేసూ నమోదు కాని విజయనగరం జిల్లాను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు.