Dalit youth Tonsured Case (Photo-Video Grab)

Visakhapatnam, August 29: విశాఖపట్నంలో దళిత యువకుడు శిరో ముండనం కేసులో సీసీ టీవీ పుటేజి (Dalit Man Tonsured CCTV Footage) బయటకు వచ్చింది. ఈ వీడియోలో బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే అందులో కొన్ని దృశ్యాలు తొలగించినట్లు కనిపిస్తోందని.. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని శాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా (Visakhapatnam Police Commissioner) వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

విశాఖ సీపీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నూతన్‌ నాయుడు (Nutan Naidu Wife) భార్య మధుప్రియతో పాటు ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరో ముండనం చేసిన కేసులో నూతన్‌ నాయుడు (Nutan Naidu) భార్య ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. అలాగే వారి ఇంట్లో పనిచేసే వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Here's CCTV footage of the incident

విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, జనసేన యాక్టివిస్ట్ నూతన్ నాయుడు ఇంట్లో.. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో శ్రీకాంత్‌ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం (శుక్రవారం) రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని బాధితుడిని పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. దళిత యువకుడికి శిరోముండనం, నూతన నాయుడు భార్యతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు

ఈ కేసులో A1గా ఉన్న నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307...342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.