ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం నేడు వచ్చిన సంగతి విదితమే.ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌ వేశారు.విచారించిన ధర్మాసనం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఈ నెల 21కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ, బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును ఏపీ హైకోర్టు విచారిస్తోంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్‌ 17ఏపై తన వాదనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు.మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది.