Chandrababu Naidu (Photo-Video Grab)

Vjy, Sep 19: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

దీంతో ఈనెల 18 వరకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం నేడు తదుపరి విచారణ చేపట్టనుంది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది.

పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తాం..మంత్రి ఆర్‌కే రోజా హెచ్చరిక

సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది. ఇక క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్ ను కోర్టు విచారించనుంది.స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ నిర్ధారించి బాబును అరెస్ట్ చేసిన సంగతి విదితమే