chandrababu (Photo-PTI)

Rajahmundry, Oct 13: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన కలుగుతుందంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌ క్లారిటీ ఇచ్చారు. బాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా.. ప్రస్తుతం 67 కేజీలకు చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.

ఏపీ స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన చంద్రబాబు గత 34 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌లో జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జైలులో బాబు ఆరోగ్యాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ కారణాలతో బాబు 5 కిలోల బరువు తగ్గారని.. దీని వల్ల ఆయన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తాజాగా చంద్రబాబు కేజీ బరువు పెరిగారంటూ జైళ్ల అధికారులు క్లారిటీ ఇచ్చారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా, వాడీవేడిగా కొనసాగిన వాదనలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌: ఇదిలా ఉంటే చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌, అలర్జీతో బాధపడుతున్నారు’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Here's DIG Ravi Kiran Voice

నారా బ్రాహ్మణి: జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆయనను అపరిశుభ్రమైన జైలులో నిర్బంధించడం హృదయవిదారకం. ఆయన ఆరోగ్యంపై అపరిశుభ్రత తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందట్లేదు. తక్షణ వైద్య సహాయం అవసరం’ అని అన్నారు.

అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

భువనేశ్వరీ: చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ ట్వీట్‌ చేశారు. జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్‌హెడ్‌ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం’’ అని తెలిపారు.

సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా చేయాలనేదే జగన్ ఆలోచన అని విమర్శించారు. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో గెలవలేమనే భయం జగన్‌కు పట్టుకుందన్నారు. వెంటనే ఆయనకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. ‘‘విష ప్రయోగం చేసి ఆరోగ్యం దెబ్బతీయాలని చూస్తున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బరువు తగ్గటం, అలర్జీలు రావటం.. ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి’’ అని సోమిరెడ్డి అన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి: చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. స్కిన్‌ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి.’’ అని సజ్జల దుయ్యబట్టారు.

ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి : చంద్రబాబు జైల్లో ఉండి అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాడని, అందుకే నారా భువనేశ్వరి, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. చంద్రబాబుకి మందులు, భోజనం పంపేది భువనేశ్వరినే కదా.. మరి ఆమె మంచి భోజనం, మందులు పంపట్లేదా..?’’ అంటూ పోసాని నిలదీశారు.

‘‘చంద్రబాబు జ్యుడిషల్‌ రిమాండ్‌లో ఉన్నారు.. జగన్ రిమాండ్‌లో కాదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగా లేకపోతే లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు. అమిత్‌ షాని కలవడానికి లోకేష్‌కి సిగ్గు లేదా? అమిత్ షా మీద రాళ్లేయించి ఇప్పుడేమో కేసులు కోసం ఆయన్ను కలుస్తారా?. లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకి తెలియవనుకుంటున్నారా..?. కమ్మ వాళ్లని రెచ్చగొట్టడానికి భువనేశ్వరి, లోకేష్ అబద్దాలు చెబుతున్నారు. జైల్లో చంద్రబాబు డాక్టర్లు, పోలీసుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నాడు’’ అని పోసాని వివరించారు.

కాంగ్రెస్ అలవాట్లు బీజేపీకి అంటించాలని పురంధేశ్వరి అనుకుంటున్నారు. అమిత్ షా పై రాళ్లు వేయించిన లోకేష్‌ని ఆయన దగ్గరకి తీసుకెళ్లారు. మోదీని నీచంగా తిట్టిన చంద్రబాబు కోసం పురంధేశ్వరి తాపత్రయ పడటమా..?. పవన్ కళ్యాణ్, లోకేష్‌లు రాజకీయాలకు పనికిరారు. బట్టలు విప్పుతాం, కొడతాం అంటే ప్రజలు ఛీ కొడుతున్నారు’’ అని పోసాని మురళీ కృష్ణ దుయ్యబట్టారు.