Chandrababu Meets Modi: ఐదేళ్ల తర్వాత ప్రధానితో చంద్రబాబు భేటీ, ఏకాంతంగా చర్చించుకున్న ఇరువురు నేతలు, ఢిల్లీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఇరువురి భేటీ

New Delhi, AUG 07: ప్రధానమంత్రి నేరేంద్ర మోదీ(Modi), తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu )సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్నారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం అనంతరం ఈ కలయిక జరిగింది. సమావేశం అనంతరం మోదీయే చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించారు. అనంతరం ఇద్దరూ కాస్త పక్కకు వెళ్లి సుమారు 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే చంద్రబాబుతో మోదీ ప్రత్యేకంగా చర్చించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో ఐదేళ్ల క్రితం బీజేపీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. మళ్లీ ఇన్నేళ్లకు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం విశేషం.

CM Jagan in Action: వ్యవసాయ రంగంపై సీఎం జగన్ సమీక్ష, డ్రోన్ల వినియోగం పెంచి, రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు  

మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతల్ని చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం సినీ నటుడు రజనీకాంత్, పిటి ఉష సహా పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. అనంతరం దేశ, రాష్ట్ర పరిణామాలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు వేచి చూస్తున్నారని తెలిపారు.

CM KCR Press Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన, రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటన 

కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు సమావేశానికి హాజరయ్యారు.. ఇక మోదీపాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులతో ఆయన ముచ్చటించారు. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు.. దాదాపు అరగంటపాటు ఆమెతో పలు అంశాలపై చర్చలు జరిపారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ద్రౌపది ముర్ముకు (Draupadi murmu)టీడీపీ మద్దతిచ్చింది.. ఈ నేపథ్యంలో ముర్ము రాష్ట్రపతి అయ్యాక చంద్రబాబు తొలిసారి ఆమెతో భేటీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు.