Case Booked against Babu & Lokesh: చంద్రబాబు,లోకేశ్‌‌లపై కేసు నమోదు, సోషల్ మీడియాలో గురుమూర్తిపై అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపణలు, ఐటి చట్టం 2000, ఎస్సీ / ఎస్టీ చట్టం 1989 కింద కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు
Chandra babu and Lokesh (Photo-ANI)

Amaravati, April 11: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (వైఎస్‌ఆర్‌సి) అభ్యర్థి ఎం. గురుమూర్తిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఛాయాచిత్రాలను పోస్ట్ చేశారనే ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద శనివారం కేసు (Case Booked against Babu & Lokesh) నమోదైంది.

తిరుపతి ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్‌ వెలువడిన విషయం విదితమే. గురుమూర్తితోపాటు, ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా సదరు పోస్ట్‌ ఉందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలు తెలిపారు.

దీనిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. టిడిపి చేత నిర్వహించబడుతున్న ఒక సోషల్ మీడియా గ్రూప్ గురుమూర్తిని అవమానపరిచేలా ఛాయాచిత్రాలను మరియు వ్యాఖ్యలను పోస్ట్ చేసిందని, నిందితులపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరారు.

లోకేశ్‌, చంద్రబాబులపై డీజీపీకి ఫిర్యాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ నేతలు, ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టులు పెట్టారని ఆరోపణ

సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలను తొలగించే చర్యలు తీసుకోవాలని సురేష్ డిజిపికి విజ్ఞప్తి చేశారు. డిజిపి ఫిర్యాదును విజయవాడ పోలీస్ కమిషనరేట్కు పంపించి, దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు. ఐటి చట్టం, 2000, ఎస్సీ / ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం, 1989 కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.