CM Jagan Speech in Kuppam: నా కుప్పం అక్కా చెళ్లెళ్లు అంటూ జగన్ స్పీచ్, కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు,కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధని తెలిపిన ఏపీ సీఎం
AP CM YS Jagan (Photo-Twitter)

kuppam, Sep 23: కుప్పంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. కుప్పం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు.. కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధని సీఎం జగన్ అన్నారు.

జనవరి నుంచి రూ. 2750కు పెన్షన్‌ పెంపు. 3 వేల వరకూ పెంచుతామన్న హామీని నెరవేరుస్తామని సీఎం తెలిపారు.డీబీటీ ద్వారా మొత్తం రూ. 1 లక్షా 71 వేల 244 కోట్ల పంపిణీ. సున్నా వడ్డీ పథకానికి రూ. 3, 615 కోట్లు అందించాం.  నాలుగు పథకాలకు 39 నెల్లలో 51 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు.

వరుసగా మూడో ఏడాది కూడా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తున్నామని, ఈ ఏడాదికిగానూ అక్కాచెల్లెమ్మల కోసం రూ.4,949 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు.

ఒక్క చేయూత ద్వారానే మూడేళ్లలో రూ.14,110 కోట్ల సాయం అందించామని, అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలియజేశారు. అలాగే ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు ఇచ్చినట్లు, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడా పారదర్శకతా, వివక్ష లేకుండా.. బటన్‌ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతున్నాయని ఆయన అన్నారు.

గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించాలని, ఒక్కసారి ఆలోచించమని ప్రతీ అక్కాచెల్లెమ్మను కోరారు సీఎం జగన్‌. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించాలనే స్వేచ్ఛను అక్కాచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టామని, అది ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలని, అవసరమైన సాంకేతికత ప్రభుత్వం తరపున అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్‌.

కుప్పంలో సీఎం జగన్‌ ‍ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు

  • మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం
  • కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో అభివృద్ధి కనిపిస్తోంది.
  • కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు..  కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధి.
  • జనవరి నుంచి పెన్షన్‌ పెంపు. జనవరి నుంచి రూ. 2750కు పెన్షన్‌ పెంపు. 3 వేల వరకూ పెంచుతామన్న హామీని నెరవేరుస్తాం.
  • డీబీటీ ద్వారా మొత్తం రూ. 1 లక్షా 71 వేల 244 కోట్ల పంపిణీ. సున్నా వడ్డీ పథకానికి రూ. 3, 615 కోట్లు అందించాం.
  • నాలుగు పథకాలకు 39 నెల్లలో 51 వేల కోట్లు ఖర్చుపెట్టాం
  • డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఇప్పటివరకూ 3.12 లక్షల కోట్లు ఇచ్చాం.
  • కేవలం అక్కా చెల్లెమ్మలకే నేరుగా రూ. 2.39లక్షల కోట్ల లబ్ధి
  • ఇల్లు, ఇంటి పట్టా విలువ రూ. 7లక్షల నుంచి రూ. 10 లక్షలకు వేసుకుంటే ఒక్క ఇల్లు, ఇంటి పట్టాలతోనే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకూ అక్కా చెల్లెమ్మలకు లబ్ధి.
  • అప్పుడు, ఇప్పుడు ఒకటే బడ్జెట్‌ ఉంది.
  • అప్పుడు ఈ పథకాలు ఎందుకు అమలు కాలేదో ఆలోచించాలి.
  • చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్‌.. కుప్పానికి నాన్‌ లోకల్‌

అంతకుముందు 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కుప్పం రూపు రేఖలు మారాయి. మూడేళ్లలో మహిళలకు రూ. 2.39 లక్షల కోట్ల సాయం అందించారు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్‌ అన్ని వర్గాలకు అండగా నిలిచారు. వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం. కుప్పం అభివృద్ధశిని వైఎస్‌ జగన్‌ చేతల్లో చూపిస్తున్నారు. భరత్‌ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

కుప్పంలో తొలిసారిగా సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్, వైఎస్సార్‌ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి

కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.