AP Covid Update: ఏపీలో తాజాగా 135 మందికి పాజిటివ్, 8,90,215 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 7,170కి చేరిన కరోనా మృతుల సంఖ్య, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతం
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, Mar 3: ఏపీలో గడచిన 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు నిర్వహించగా 135 మందికి పాజిటివ్ (AP Covid Update) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 31 పాజిటివ్ కేసులు రాగా, విశాఖ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 15, శ్రీకాకుళం జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 10 కేసులు గుర్తించారు.

ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరులో ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,215 పాజిటివ్ కేసులు (AP Coronaviru) నమోదు కాగా 8,82,219 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 826 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,170కి చేరింది.

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు సగటున రోజుకు 69 కేసులు నమోదైనట్టు వెల్లడైంది. ఓవైపు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో కేసులు పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ వస్తోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య స్థిరంగానే కొనసాగుతోంది.\

గత వారంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, పేద‌ దేశాల‌కు వ్యాక్సిన్ ఆల‌స్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో, దేశంలో తాజాగా 14,989 మందికి కరోనా

2020 జూలై, ఆగస్ట్‌ మాసాల్లో ఒక దశలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడా సంఖ్య 70 లోపే నమోదవుతుండటం గమనార్హం. గతంతో పోలిస్తే నమూనాల నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా కాస్త తగ్గింది. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో ఒక దశలో రోజుకు 70 వేలకు పైగా టెస్టులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా సంఖ్య సగటున రోజుకు 27 వేలుగా నమోదైంది. గతంతో పోల్చితే మృతుల సంఖ్య భారీగా నియంత్రణలోకి వచ్చినట్టు తేలింది.