Amaravati, June 4: ఆంధ్రప్రదేశ్‌లో (AP Coronavirus) గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క రోజు కోవిడ్ (Andhra Pradesh) వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దేశ రక్షణ శాఖలో కరోనా కలకలం, భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో పలువురు అధికారులు
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 19 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,377 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 2,273 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 71కు చేరగా, ప్రస్తుతం 1,033 మంది వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Here's AP corona Report
#COVIDUpdates: as on 04/06/2020
Total positive cases: 3377
Discharged: 2273
Deceased: 71
Active cases: 1033#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Oi0iova1G8
— ArogyaAndhra (@ArogyaAndhra) June 4, 2020
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 8,066 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,03,747కు చేరింది. ప్రతి పది లక్షల జనాభాలో 7,561 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆరు వేలు దాటిన మృతుల సంఖ్య, దేశంలో కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 2,16,919కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించవచ్చు.
ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించామని తెలిపారు.