Coronavirus in AP: ఏపీలో తాజాగా 10,004 మందికి కరోనా, 4,34,771కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, తాజాగా 85 మంది మృత్యువాత, రాష్ట్రంలో 3969​కు చేరుకున్న మృతుల సంఖ్య
COVID-19 Outbreak in India | File Photo

Amaravati, August 31: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్‌ కేసులు (Coronavirus in AP) వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,771కు (Andhra pradesh corona cases) చేరింది. నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 85 మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరులో పన్నెండు, చిత్తూరులో తొమ్మిది, ప్రకాశంలో తొమ్మిది, కడపలో ఎనిమిది, అనంతపురంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు,కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.

మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య 3969​కు చేరింది. ఆదివారం 8,772 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,30,526 అయ్యింది. కాగా రాష్ట్రంలో మొత్తం 37,22,912 పరీక్షలు పూర్తి చేశారు. తూర్పుగోదావరి 1,383, నెల్లూరు 1,086, శ్రీకాకుళం 1,023, పశ్చిమగోదావరి జిల్లాలో 1,142 కొత్త కేసులు నమోదయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే

కోవిడ్-19 భిన్న వ్యక్తులపై భిన్న రకాలుగా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సోకిన చాలా మందిలో తేలికపాటి నుండి ఒక మాదిరి స్థాయి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి, వీరు ఆసుపత్రిలో చేరకుండానే తిరిగి కోలుకుంటారు. అయితే దీన్ని ఎలా గుర్తించాలనే దానిపై కొన్ని మార్గ దర్శకాలను WHO రూపొందించింది.

ప్రణబ్ దాదా జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం

అత్యంత సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు:

జ్వరం

పొడి దగ్గు

అలసట

తక్కువ సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు:

నొప్పులు మరియు బాధలు

గొంతు మంట

విరేచనాలు

కండ్లకలక

తలనొప్పి

రుచి లేదా వాసన శక్తి కోల్పోవడం

చర్మంపై దద్దుర్లు లేదా వేళ్లు లేదా కాలి వేళ్లు రంగు కోల్పోవడం