AP Coronavirus: ఏపీలో ఒక్కరోజే 12 మంది కరోనాతో మృతి, రాష్ట్ర వ్యాప్తంగా 22, 259కి చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, చిత్తూరులో ఒక్క రోజే 70 మందికి కరోనా పాజిటివ్‌
2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati, July 8: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 27,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,062 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) వెలుగు చూశాయి. కరోనా నుంచి కోలుకొని 1,332 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు (coronavirus Cases) నమోదు అయినప్పటి నుంచి ఇదే అత్యధికంగా డిశ్చార్జ్‌ అవ్వడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. కాగా నిన్న ఒక్కరోజే 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో కర్నూల్‌లో 3, అనంతపూర్‌లో 2, కృష్ణాలో 2, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరులో 1, గుంటూరులో 1, విశాఖపట్నంలో ఒకరు చొప్పున మరణించారు. దేశంలో ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,752 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 7,42,417కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య

రాష్ట్రంలో (Andhra Pradesh) అసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల కంటే రికవరీ అయిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటి వరకు 11,101 మంది కోలుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాటికి 22, 259 మంది కరోనా బారిన పడగా..264 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 10, 894 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,77, 773 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మంగళవారం నాడు తిరుపతి నగరంలో 70 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్లుకు గాను 40 డివిజన్లలో రెడ్‌ జోన్స్ ఉన్నాయన్నారు. నగరంలో 350 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 110 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జి చేశారన్నారు. కరోనా బారినపడిన వారిలో టీటీడీ ఉద్యోగులు సైతం ఉన్నారన్నారు. నగరవాసులు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని గిరీష పేర్కొన్నారు. తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు, ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, వైఎస్సార్ గురించి ఎవరేమన్నారంటే..

ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామంలో తండ్రీ కొడుకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హాస్పిటల్‌కి తరలిస్తుండగా తండ్రి మృతి చెందాడు. కొడుకుని వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించింది. పశ్చిమగోదావరి జిల్లా తాజాగా మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులో 23, తాడేపల్లిగూడెంలో 12 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల 112కు చేరింది. వైఎస్సార్ పుట్టిన రోజును రైతు దినోత్సవంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెడుతూ ఉత్తర్వులు

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఏలూరు, పాలకొల్లులలోని టిడ్కో హౌసింగ్ కాలనీలు కోవిడ్ కేర్ సెంటర్‌లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జిలో కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఎటువంటి లక్షణాలు లేకపోతే, పదిరోజుల్లోనే డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. ఏలూరు వన్‌టౌన్‌లో అధికారులు మరో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు.

తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కొత్తగా మరో 15 కేసులు నమోదు అయ్యాయి. తెనాలి మున్సిపల్ కమిషనర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ ప్రేమ్‌కుమార్ కరోనాతో మృతి చెందారు. కరోనా సోకడంతో సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ ప్రేమ్‌కుమార్ మృత్యువాతపడ్డారు.

ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 52 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132గా ఉంది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిని పడి 21 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 90,897 శ్యాంపిళ్లు పంపగా... 88,490 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2407 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో 685 ఉన్నారు. నిన్న కరోనా నుండి కోలుకుని 150 మంది డిశ్చార్జ్ అవగా... ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 607కి చేరింది. అలాగే జిల్లాలో ప్రస్తుతం 525 యాక్టివ్ కేసులు ఉన్నాయి