Amaravati, June 24: ఏపీలో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు (Coronavirus cases) నమోదవగా, ఈ వైరస్ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (AP's Coronavirus Report) 10,331కి చేరగా, 129 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,423 యాక్టివ్ కేసులు ఉండగా, మరో 4779 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 37 మంది, రాష్ర్టానికి చెందినవారు 448 మంది ఉన్నారు. వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు
ఇదిలా ఉంటే కరోనావైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రికార్డ్ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Here's AP Corona Report
#COVIDUpdates: 24/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8306 పాజిటివ్ కేసు లకు గాను
*3712 మంది డిశ్చార్జ్ కాగా
*129 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4465#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/U4XVIW1Qhv
— ArogyaAndhra (@ArogyaAndhra) June 24, 2020
వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఉగ్రరూపం దాల్చిన కరోనా, దేశంలో ఒక్కరోజే 465 మంది మృతి, ఇండియాలో నాలుగు లక్షల యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసులు
ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. 4,779 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో46.26 శాతం రికవరీ రేటుగా ఉంది. 10లక్షల మందికి సగటున 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఏపీలో పాజిటివ్ శాతం 1.38కాగా, దేశంలో పాజిటివ్ శాతం 6.20గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.