Amaravati, Sep 8: ఏపీలో గడిచిన 24 గంటల్లో 70,993 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 10,601 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు (Coronavirus in AP) చేరింది. కొత్తగా 73 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,560కు (Coronavirus Deaths) చేరింది. సోమవారం 11,691 మంది కరోనా (Coronavirus (COVID-19) నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీలో 4,15,765 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 96,769 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటి వరకు 42,37,070 కోవిడ్ టెస్టులు చేశారు. కరోనా కారణంగా నిన్న గుంటూరులో 10 మంది, అనంతపూర్‌లో 8, చిత్తూరులో 8, కడపలో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 5, కృష్ణా5, పశ్చిమగోదావరిలో 5, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2,విజయనగంలో 1 చొప్పున మరణించారు.
కొత్త కేసుల పరంగా చూస్తే.. తూర్పు గోదావరిలో కొత్తగా 1244 కేసులు, పశ్చిమగోదావరిలో 1101, నెల్లూరు 1299, ప్రకాశం జిల్లాలో 1042 కొత్త కేసులు వచ్చాయి. చిత్తూరు(927), కడప(904)లోనూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అనంతపురంలో కొత్తగా 753, గుంటూరులో 703, కర్నూలులో 380, శ్రీకాకుళం 818, విశాఖపట్నం 573, విజనగరం జిల్లాలో 593 కొత్త కేసులు నమోదయ్యాయి.
రికవరీలో ఇవాళ మెరుగైన గణాంకాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,915 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 72,573 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది. దీంతో ఏపీలో నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 41.07లక్షలకు పెరిగింది.