Coronavirus in AP: చిత్తూరును వణికిస్తున్న కరోనా, అత్యధిక కేసులు ఆ జిల్లా నుంచే, రాష్ట్రంలో 24 గంటల్లో 997 మందికి కోవిడ్ పాజిటివ్, ఐదుగురు మృతితో 7,210కి చేరుకున్న మరణాల సంఖ్య
Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, Mar 29: ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా, 997 మందికి పాజిటివ్ (Coronavirus in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 152, విశాఖ జిల్లాలో 139, కృష్ణా జిల్లాలో 110 కరోనా కేసులు గుర్తించారు.

అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 282 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు (New Covid Deaths) మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,99,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,498 మందికి కరోనా నయమైంది. ఇంకా 6,104 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,210కి పెరిగింది.

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిందని, ఇందుకు ప్రజలు సహకరించాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనల్ని పౌరులంతా తప్పనిసరిగా పాటించాలని కోరారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించడంతో కఠిన చర్యలు చేపట్టామన్నారు.

గబ్బిలాల ద్వారా కరోనావైరస్, ఎట్టకేలకు వైరస్ పుట్టుక మీద స్పందించిన చైనా, ఇంకా బయటకు రాని డ‌బ్ల్యూహెచ్‌వో రిపోర్టు, దౌత్య‌వేత్త ద్వారా నివేదికను సంపాదించిన అసోసియేటెడ్ ప్రెస్ ఏజెన్సీ

కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాలను ప్రజలకు తెలియజేసేలా నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో మాసు్కలు ధరించని వారికి, కోవిడ్‌ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని, నిత్యావసర సరుకులు, అత్యవసరాల కోసమే బయటకు రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం, వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాసు్కలు ధరించడం, శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం పాటించటం వంటివి విధిగా పాటించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్‌ నియమాలు కచి్చతంగా పాటించేలా చూడాలని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల అధికారులకు సూచించారు.

తిరుపతిలో ఫ్యాను గెలుపు తధ్యమా..మెజార్టీ ఎంత ఉండబోతోంది? అధికార ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు, వీడియోలు 7557557744 నంబర్‌కు వాట్సాప్ చేస్తే అకౌంట్‌లో పదివేలు వేస్తామనంటున్న అచ్చెన్నాయుడు, నామినేషన్లు దాఖలు చేసిన మూడు పార్టీల అభ్యర్థులు

కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పోలీసులు మాస్‌్కలు ధరించని వాహన చోదకులకు జరిమానాలు విధిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మాసు్కలు ధరించని 18,565 మందికి రూ.17,33,785 జరిమానా విధించినట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. విశాఖపట్నం నగరంలో 1,184 మందికి రూ.1,16,700, తూర్పు గోదావరి జిల్లాలో 2,299 మందికి రూ.1,78,050, విజయవాడలో 2,106 మందికి రూ.1,93,850, గుంటూరు అర్బన్‌లో 844 మందికి రూ.1,05,720 జరిమానా విధించారు.