Amaravati, July 20: ఏపీలో గడిచిన 24 గంటల్లో 33,580 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,074 పాజిటివ్ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోమొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,724 కు (Coronavirus in AP) చేరింది. తాజా పరీక్షల్లో 17,385 పరీక్షలు ట్రూనాట్ పద్ధతిలో చేయగా.. 16,195 పరీక్షలు ర్యాపిట్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. రాష్ట్రంలో (AP Coronavirus) కొత్తగా 1335 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. తిరుపతిలో మళ్లీ పూర్తిగా లాక్‌డౌన్, వచ్చే నెల 5 వరకు కొనసాగనున్న ఆంక్షలు, శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత, సంతాపం తెలిపిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 24,228 కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 54 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 696 కు చేరింది. 28,800 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 13,49,112 నమూనాలను పరీక్షించారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఏపీలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తూ.గో తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 596 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 559 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 354, అనంతపురంలో 342, శ్రీకాకుళం 261, ప్రకాశం 221, కడప 152, కృష్ణా 129, చిత్తూరు 116, విశాఖపట్నం 102, నెల్లూరు 100, విజయనగరం జిల్లాలో 56 కరోనా కేసులు నమోదయ్యాయి.
Here's AP Corona Report
#COVIDUpdates: 20/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 50,829 పాజిటివ్ కేసు లకు గాను
*21,664 మంది డిశ్చార్జ్ కాగా
*696 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 28,469#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0WtQhBgekN
— ArogyaAndhra (@ArogyaAndhra) July 20, 2020
కోవిడ్-19పై సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు (Covid Hospitals) సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతున్నట్లు సీఎం (AP CM YS jagan) ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నట్లు వైయస్ జగన్ తెలిపారు. ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా టెస్టులు, తెనాలి ఎమ్మెల్యేకి కోవిడ్-19, లాక్‌డౌన్ ప్రకటించిన షార్, మానవత్వాన్ని మింగేస్తోన్న కరోనావైరస్
ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నివేదిక తయారీ చేయాలని ఆదేశించారు. 5 రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని సీఎం ఆదేశించారు.
కోవిడ్ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలని సూచించారు. కోవిడ్ ఎవరికైనా వస్తుందని, ఆందోళన వద్దని చెప్పారు. వైద్య సహాయం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటే తగ్గుతుందని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్ద వాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దని జగన్ హితవుపలికారు.