Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati,Nov 29: ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 690 మందికి (AP Coronavirus) పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683కు (Coronavirus Positive Cases) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 3,787 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,52,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,397. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 7 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,988కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇండియాలో గత 24 గంటల్లో 41,810 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696కు చేరుకుందని తెలిపింది.

మంత్రి పేర్ని నానిపై దాడి, తృటిలో తప్పిన ప్రమాదం, మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో తాపీతో దాడిచేసిన దుండుగుడు, నిందితుడుని అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 88,02,267కు చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,53,956గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 42,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.