Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati, Nov 24: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 545 పాజిటివ్‌ కేసులు (Covid in AP) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86,2758కి (AP Coronavirus Report) చేరింది. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,42,416 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మొత్తం 10 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 6948కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 13,394 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఈ నెల 25న తీరాన్ని దాటనున్న నివార్, ఏపీకి పెను ముప్పు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలు అలర్ట్

దేశంలో క‌రోనా కేసులు నిన్న 44 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, నేడు 37 వేల‌పైచిలుకు కేసులు (India Coronavirus) వ‌చ్చాయి. ఇది సోమ‌వారం కంటే 13.8 శాత త‌క్కువ అని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ తెలిపింది. దీంతో మొత్తం క‌రోనా కేసులు 92 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో నిలిచాయి. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 37,975 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు సంఖ్య 91,77,841కి చేరాయి. ఇందులో 4,38,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మ‌రో 86,04,955 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 1,34,218 మంది క‌రోనా వ‌ల్ల‌ మ‌ర‌ణించారు. ఇందులో నిన్న‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 480 మంది మ‌ర‌ణించ‌గా, 42,314 మంది కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీరేటు 93.75 శాతంగా ఉంది. నిన్న దేశంలో 10.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అందులో 3.5 శాతం మంది అంటే 37,975 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.