Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, Sep 9: ఏపీలో మరోమారు 10 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 71,692 నమూనాలు పరీక్షించగా 10,418 మందికి కరోనా (Coronavirus) నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కి (Coronavirus cases in Andhra Pradesh) చేరింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా 74 మంది మృత్యువాత పడగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,634కి పెరిగింది. తాజాగా 9,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా ఇప్పటివరకు 4,25,607 మందికి కరోనా నయం అయింది. ఇంకా, 97,271 మందికి చికిత్స కొనసాగుతోంది.ఇప్పటివరకు ఏపీలో 43.08 లక్షల కరోనా టెస్టులు చేశారు.

కొత్తగా కడప 9, నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఏడుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. విజయనగరం 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399, ప్రకాశం 1,271, పశ్చిమగోదావరి జిల్లోలో 1,134 కరోనా కేసులు నమోదయ్యాయి.

అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు. జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు తోమర్, సురేష్, అక్టోబరు నుంచి ప్రతి రోజూ ఢిల్లీకి కిసాన్ రైలు

AP Corona Update 

రాష్ట్రంలో కోవిడ్‌–19 రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 80.40 శాతానికి చేరింది. దేశంలో ఏడు రాష్ట్రాల్లో మాత్రమే రికవరీ రేటు 80 శాతం దాటగా అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి