COVID-19 Outbreak in India | File Photo

Amaravati, July 28: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. 7,948 మందికి పాజిటివ్ వచ్చిందని (COVID-19 Cases in AP) ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో (New corona positive cases) 1367 మందికి, కర్నూలు జిల్లాలో 1146 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.  తాజాగా నమోదైన కేసులతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం క‌రోనావైరస్ బారినపడిన వారి సంఖ్య 1,10,297కి (AP Corona Positive Cases) చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 52,622 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 56,527 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పుడు లెక్కలు అవసరం లేదు, లక్ష కేసుల్లో సగం మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు, వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఎదురు చూద్దాం, కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 58 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. గుంటూరు జిల్లాలో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది మరణించారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఐదుగురి చొప్పున, నెల్లూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో నలుగురి చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురంలో ముగ్గురు, కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 1148కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 3,064 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 52,622కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 17,49,425 శాంపిల్స్‌ను పరీక్షించారు.