AP Coronavirus Report: ఏపీలో తాజాగా 10,825 మందికి కరోనా, రాష్ట్రంలో 4,87,331కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, కొత్తగా 71 మంది మృతితో 4,347కి చేరుకున్న మరణాల సంఖ్య
Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, Sep 5: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,326 నమూనాలు పరీక్షించగా 10,825 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు ( Coronavirus Updates in AP) చేరింది. కొత్తగా 71 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,347కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇక గడిచిన 24 గంటల్లో 11,941మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 3,82,104 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 40,35,317మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశంలో ఏపీదే అగ్రస్థానం, రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019 ర్యాకింగ్స్‌ను విడుదల చేసిన కేంద్రం

నెల్లూరు 13, అనంతపురం 8, పశ్చిమగోదావరి జిల్లాలో 8 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు 7, గుంటూరు 7, విజయనగరం 6, ప్రకాశం 5, విశాఖ 5 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా 4, కడప 3, కర్నూలు 2, శ్రీకాకుళం 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం 1,032, పశ్చిమగోదావరి జిల్లాలో 1,103 నెల్లూరు 1,046, కడప 1,039 కేసులు నమోదయ్యాయి.

పర్యాటకంపై జగన్ సర్కారు కీలక ఆదేశాలు, ఇకపై పర్యాటక కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్లను తప్పనిసరి, అత్యుత్తమ పర్యాటక సేవలు అందించేలా చర్యలు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే దొరబాబు కరోనా బారినపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని దొరబాబుకు భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. కాగా వైఎస్సార్‌ సీపీకి చెందిన పలువురు నేతలు కరోనా బారినపడి కోలుకున్నారు.