cyclone (photo-PTI)

Amaravati, May 9: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని (Cyclone Asani) పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. అసని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది విశాఖపట్నంకు ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

అసని తుఫాను మరో రెండు రోజులు బలహీనపడే అవకాశం (Cyclonic storm to weaken during next 24 hours) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా గంటకు 120 మీటర్ల వేగంతో పెనుగాలులు వస్తాయని, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఆరు గంటల్లో తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా పయనించిందని భారత వాతావరణ శాఖ సీనియర్‌ శాస్త్రవేత్త ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. తుఫాను ఒడిశాలోని పూరీకి దక్షిణ – ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 580 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌‌గా ఏపీ ఉండాలి, రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరాలను ఆనుకొని.. వాయువ్య బంగాళాఖాతంలో చేరే అవకాశం ఉన్నది. తుఫాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, కోల్‌కతా, హుగ్లీ, పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం (Andhra to receive heavy rainfall ) ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం, యువతిపై కాల్పులు జరిపి తను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, పెళ్లికి నిరాకరించడంతో ఘటన

సముద్రం అల్లకల్లోలంగా మారుతోందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాను కారణంగా మంగళవారం సాయంత్రం నుంచి ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అలజడి ఉంటుందని, గురువారం (మే 12) వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, మే 10 నాటికి ఉత్తరాంధ్ర తీరాన్ని సమీపించనున్న అసని... ఆపై దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.