Vishakhapatnam December 04: ఉత్తరాంధ్రను మరో తుపాను(Cyclone) వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం శుక్రవారం ఉ.11.30 గంటలకు తుపాను(Cyclone)గా మారింది. దీనికి జవాద్(Jawad) అని పేరు పెట్టారు. ఇది విశాఖ(Vizag)కు ఆగ్నేయంగా 280 కి.మీల దూరంలో.. ఒడిశా(Odisha)లోని గోపాల్‌పూర్‌కి 400 కి.మీ.లు, పూరీ(Puri)కి 460 కి.మీ, పారాదీప్‌కి 540 కి.మీ.ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుండగా.. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, ఒడిశా(Odisha) తీరాలకు సమీపంలోకి వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
విశాఖ(Vizag) తీరానికి దగ్గరైన తర్వాత ఇది దిశను మార్చుకుని ఒడిశా వైపుగా వెళ్లనుంది. 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.ప ఆ తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్(West Bengal) వైపు పయనించనుంది. దీని ప్రభావంవల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80–90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 110 కి.మీ గరిష్ట వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. తుపాను ప్రభావంతో సముద్రం(Sea) అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ నెల 5 వరకూ మత్స్యకారులు(Fisherman) వేటకు వెళ్లరాదని సూచించారు అధికారులు. తుపాను కారణంగా శనివారం శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం (Vizayanagaram), విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ రెడ్ అలెర్ట్(Red alert) ప్రకటించారు. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో.. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
Andhra Pradesh | Continuous rains witnessed across the district, windspeeds of 50kmph at few locations; 79 cyclone shelters operation since yesterday. NDRF, SDRF, fire teams on alert and deployed across the district: Shrikesh B Lathkar, Collector & DM, Srikakulam on cyclone Jawad pic.twitter.com/G6sSBm3X7L
— ANI (@ANI) December 4, 2021
తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) , ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను ఆయా జిల్లాల్లో మోహరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 54వేల మందికి పైగా ప్రజలను తరలించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.
విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను మూడ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది.