CM Jagan Review With Collectors on Cyclone (Photo-AP CMO)

Vjy, Dec 5: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. కాగా మిచౌంగ్ తుపాను (Cyclone Michaung) వాయుగుండంగా బలహీనపడింది. ఇది మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఈశాన్య తెలంగాణ‌వైపు ప‌య‌నిస్తున్న వాయుగుండం, రాబోయే 24 గంట‌ల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఏపీ, త‌మిళ‌నాడుల్లో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ..ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి.అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాని కోరారు. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలని సూచించారు. రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలని, ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలని సీఎం తెలిపారు.

సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..

పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి

దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి

రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు

పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి

అన్నిరకాల మానవ వనరులు దీనిపై దృష్టి పెట్టండి

ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

వారు అధైర్యపడాల్సిన పనిలేదు

ప్రతి రైతునూ ఆదుకుంటుంది

పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుంది.

సబ్సిడీపై విత్తనాల సరఫరాకు రకాలుగా సిద్ధం కావాలి.

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి

రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి

దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి

వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు.

చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది

ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం

విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది

వలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది

వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు.