Amaravati, August 4: ఏపీలో తాజాగా 7,822 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య (coronavirus cases) 1,66,586కి చేరింది. ఈ రోజు తూర్పు గోదావరి (1,113), విశాఖపట్నం (1,049) జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 63 మంది మృత్యువాత (COVID-19 deaths) పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కన్నుమూశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,537కి చేరింది. కొత్తగా 5,786 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 88,672 కాగా, ప్రస్తుతం 76,377 మంది చికిత్స పొందుతున్నారు. దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్, అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చుకున్నా అంటూ వీడియో
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (Former Bhadrachalam MLA Sunnam Rajaiah) కరోనాతో మృతి చెందారు. స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో రాజయ్య తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించగా...చికిత్స పొందుతూ రాజయ్య మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రచాలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త, కోవిషీల్డ్‌పై ఫేజ్ 2,ఫేజ్ 3 ప్రయోగాలకు డీసీజీఐ అనుమతులు, త్వరలో ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని తన సొంత గ్రామంలోనే ఉంటున్నారు. సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా చాలా సాధారణమైన జీవితాన్ని గడిపారు.. అసెంబ్లీకి ఆటోలో, బస్సులో వెళ్లిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. అసెంబ్లీకి మాత్రమే కాదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా బస్సులో తిరిగిన సాదాసీదా మనిషి. గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో వైద్య చికిత్స పొందిన ఆయన.. అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.
Here's AP Corona Report
#COVIDUpdates: 03/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,63,691 పాజిటివ్ కేసు లకు గాను
*85,777 మంది డిశ్చార్జ్ కాగా
*1,537 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 76,377#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sIME6W5ya2
— ArogyaAndhra (@ArogyaAndhra) August 3, 2020
అయితే.. ఇంతకు ముందు నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినా సోమవారం భద్రాచలంలో మరోసారి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో విజయవాడకు తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున మూడుసార్లు గెలిచిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇవాళ ఆయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.