Vijayawada, May 19: తెలుగుదేశం-జనసేన (TDP-Janasena) మధ్య.. మళ్లీ పొత్తు పొడుస్తుందా? లేదా? అని.. ఏపీ మొత్తం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోంది. మరి.. పొడిస్తే మంచిదా? పొడవకపోతే మంచిదా? పొడిస్తే ఏంటి? పొడవకపోతే ఏంటి? టీడీపీతో పొత్తు.. జనసేనకు మేలు చేస్తుందా? వైసీపీకి(YCP) ప్లస్ అవుతుందా? ఒక పొత్తు పొడవాలంటే.. ఇలా.. చాలా లెక్కలుంటాయ్. ఆ లెక్కలన్నీ.. పొత్తు పెట్టుకునే పార్టీలు వేసుకోవాలి. కానీ.. ఈ రెండు పార్టీల పొత్తుపై.. ఓ సీనియర్ పొలిటీషియన్ లెక్కలేసేశారు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై.. పవన్ కల్యాణ్‌కి సలహా కూడా ఇచ్చేశారు. మరి.. పవన్ ఏం చేయబోతున్నారు? సేనానికి.. ఉచితంగా.. సముచితమైన సలహా ఇచ్చిన ఆ సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరు? ఆయనే.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య (Hari ramajogaiah). పెద్దాయన రాజకీయం ఈనాటిది కాది. యాభై ఏళ్ల కిందటే.. చట్టసభలో అడుగుపెట్టిన హిస్టరీ ఆయనది. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ దాకా అన్ని పార్టీలనూ చూసేశారు. కానీ.. ఈ మధ్య ఎందుకో జనసేన (Janasena) అంటే లైక్ చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో.. పవన్‌కి (Pawan Kalyan) రాజకీయంగా సలహాలు కూడా ఇస్తుంటారు.
ఈసారి.. బహిరంగ లేఖ రూపంలో.. పవన్‌కి కీలకమైన సలహా ఇచ్చారు రామజోగయ్య. పవన్ కల్యాణ్‌ని.. వైసీపీ కవ్విస్తోందని.. ఒంటరిగా పోటీ చేయమని చెప్పడం వెనుక ఫక్తు రాజకీయమే ఉందని అభిప్రాయపడ్డారు. విపక్షాలన్నీ.. విడివిడిగా పోటీ చేస్తే.. మళ్లీ వైసీపీదే అధికారమని చెప్పారు. అందువల్ల.. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా.. పవన్ జాగ్రత్త పడాలని.. ఇందుకోసం.. టీడీపీతో పాటు బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఇదే జరిగితే.. కచ్చితంగా అధికారం దక్కుతుందని జోస్యం చెప్పారు రామజోగయ్య. జనసేనకు పెద్దాయన మద్దతు, ఆయనిస్తున్న సలహాలు.. జనసైనికుల్లో జోష్ పెంచేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి.. కాపు సంక్షేమ సేన తరఫున జోగయ్య రాసిన లేఖ.. ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. అయితే.. పెద్దాయన రాసిన లేఖ.. ఆయన చెప్పిన మాట.. పవన్ కల్యాణ్‌లో మళ్లీ పొత్తు ఆలోచనలు రేపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. జోగయ్య చెప్పినట్లుగా.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఎలా ఉంటుంది? ఏ రకంగా కలిసొస్తుందనే విషయాలపై.. పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ నుంచి ఎన్ని విమర్శలొచ్చినా.. మిగతా వర్గాల నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చినా.. ఏపీలో బలపడాలన్నా.. కొన్ని సీట్లైనా.. ఖాతాలో వేసుకోవాలన్నా.. ఇప్పుడున్న పరిస్థితులను క్యాష్ చేసుకోవడమే బెటరనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం.. టీడీపీతో పొత్తు పెట్టుకొని.. ఎన్నికలకు వెళ్తే.. పార్టీకి.. ఎంతో కొంత మేలు జరగడంతో పాటు వైసీపీ సీట్లను కూడా తగ్గించే అవకాశం ఉందని ఫీలవుతున్నట్లు.. పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.
వైసీపీ ట్రాప్‌లో పడకుండా.. పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని రామజోగయ్య ఇచ్చిన సలహాను.. పవన్ అంత ఈజీగా తీసిపారేసే చాన్స్ లేదు. ఓ రకంగా.. వచ్చే ఎన్నికల గమ్యం ఎలా ఉండాలన్నది ఆయన చెప్పేశారనే అనుకోవాలి. అందువల్ల.. పెద్దాయన మాటలకు ఎంతో విలువనిచ్చే పవన్ కల్యాణ్.. కచ్చితంగా పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. మరి.. అప్పటికుండే రాజకీయ పరిస్థితులతో.. సేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది.. వేచి చూడాలి.