Former MP Sabbam Hari regrets using harsh words against officials (Photo-Twitter)

Visakhapatnam, Oct 5: మాజీ ఎంపీ సబ్బంహరి అనుమతులకు విరుద్ధంగా ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారంటూ విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ 24 గంటల్లో నేనేంటో చూపిస్తా... ఒక్కొక్కరి తాట తీస్తా... నేనంటే ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తా.. అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు.

అయితే తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మేయర్‌ సబ్బం హరి 24 గంటల తర్వాత.. నేను ఆ రోజు సహనం కోల్పోయి మాట్లాడాను. ఆవేశంలో అన్న మాటలకు మన్నించమని (Former MP Sabbam Hari regrets) కోరుతున్నాను.. అని క్షమాపణ కోరారు. జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని నిబంధనల మేరకు కూల్చివేసిన అధికారులతో పాటు ఏకంగా పాలకులపై కూడా సబ్బం హరి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్నారు. దీనికి ఆయన చింతిస్తున్నానంటూ సారీ (Sabbam Hari Apologized) చెప్పారు.

కాగా మాజీ ఎంపీ సబ్బం హరి (Sabbam Hari) పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇంటి ప్రహరీ తొలగింపు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని.. తమకు ఎవరిపైనా కక్ష లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కబ్జా విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు నోటీసులు జారీచేశారని వివరించారు. ఆయన నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించడంతో గోడకు అంటించారని.. కానీ, ఆయన వాటిని తీసుకుని ఉంటే వివరణ ఇచ్చేందుకు అవకాశముండేదని బొత్స అభిప్రాయపడ్డారు.

Here's Demolition Visuals

మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పొలిటికల్‌ బ్రోకర్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. ‘నీకు మేయిర్‌గా, ఎంపీగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మహానేత వైఎస్సార్‌.. అది మరిచిపోయి సీఎం వైఎస్‌ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోం’.. అని ఆయన హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్బం హరి మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగనన్న సైనికుడిలా వచ్చి నాలుక కోస్తానని హరిని హెచ్చరించారు. జీవీఎంసీకి సంబంధించిన సుమారు రూ.3 నుంచి 4 కోట్ల విలువైన 213 గజాల భూమిలో ‘సబ్బం’ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తే చంద్రబాబు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Here's Sabbam Hari file visual: 

ఇదిలా ఉంటే అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్‌ 5న ఏపీఎస్‌ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్‌ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు.

అక్టోబర్ 8న జగనన్న విద్యా కానుక, లాంఛనంగా ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ

మొత్తం మీద పార్క్‌లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్‌ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్‌ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.

ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. కాగా సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

 బంగాళఖాతంలో మరో అల్ప పీడనం, రానున్న రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం

ఈ సమయంలోనే సహనం కోల్పోయిన సబ్బం హరి అక్కడి చేరుకున్న అధికారులపై నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించలేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు.