Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati,Oct 5: ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’(Jagananna Vidya Kanuka) కార్యక్రమాన్ని అక్టోబర్‌ 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా (AP CM YS Jagan Mohan Reddy to launch Vidya Kanuka) ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్లు పంపిణీ (Students Kits) చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రతి స్టూడెంట్‌ కిట్‌లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయని తెలిపారు.

రైతులకు జగన్ సర్కారు శుభవార్త, అక్టోబర్ 16 నుంచి పంటల కొనుగోలు, రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారుల సూచన

బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైనా ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి (State Information Commissioner Vijay Kumar Reddy) తెలిపారు.

ఏపీ పోలీస్‌ సేవా యాప్‌

ఇప్పటికే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇప్పుడు ‘ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ (సిటిజన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌)’ ( AP Police Seva App) ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది. గత నెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఈ యాప్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1 నుంచి యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచగా 3 నాటికి.. అంటే కేవలం మూడు రోజుల్లోనే 37 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ప్రధానితో ఏపీ సీఎం భేటీ ఖరారు, అక్టోబర్ 6న ప్రధాని మోదీతో వైయస్ జగన్ సమావేశం, అదే రోజు జల వివాదాలపై అపెక్స్‌ కమిటీ భేటీ, పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం

ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’ ద్వారా ప్రజలు పొందిన సేవల్లో అత్యధికంగా ఎఫ్‌ఐఆర్‌ల డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో తమ వాహనాలకు జరిమానా పడిందా? మరేదైనా నేరంలో ఉందా? అనే అంశాలు ఉన్నాయి. యాప్‌ ద్వారానే నేరుగా ఫిర్యాదులు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ, తప్పిపోయిన వారి గురించి వెతికేస్తున్నారు.