Road Accident in Gudur:నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి, తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తుండగా విషాద ఘటన
Road accident (image use for representational)

Nellore, July 3: నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై లారీ-కారు ఢీకొనడంతో నలుగురు మృతి (Four kills in road accident) చెందారు. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన (Road Accident in Gudur) జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిగా పోలీసులు గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

ఇక తిరుపతి అలిపిరి రోడ్డులో ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ కారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఏపీలో అదుపులోకి వచ్చిన కరోనా, తాజాగా ,175 కేసులు నిర్ధారణ, 3,692 మంది బాధితులు డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో రాజేంద్రనగర్‌ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ లారీ వెనుక నుంచి ముగ్గరు వ్యక్తిలను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ అడిషనల్ డీసీపీ వెంకట్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

అనంతపసురం జిల్లా హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన దంపతులు గిరిష్‌, స్వాతిగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు.