Vijayawada, Oct 11: పండుగపూట పెరిగిన ధరలతో కుదేలైన పేద, మధ్యతరగతిదారులకు ఏపీ సర్కార్ (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో (Ration Shops) శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఎందుకలా??
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇండోనేసియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి వంట నూనెల దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో వాటి ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు.
ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు