Andhra Pradesh Stampede. (Photo Credits: ANI)

Vjy, Jan 2: గుంటూరు తొక్కిసలాట ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళల మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.పేదలకు సాయం చేసే కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన విచారకరమన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి, పలువురికి గాయాలు, గుంటూరు సభలో విషాదం

తొక్కసటలో ముగ్గురు మృతి చెందడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు పరిహరం ఇస్తామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 30 వేల మందికి జనతావస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కానుకలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం, దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు, నర్సీపట్నం సభలో మండిపడిన సీఎం జగన్

దీంతో ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరోవైపు ఉయ్యూరు ఫౌండేషన్‌ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల సాయం ప్రకటించింది. చనిపోయినవారి కుటుంబసభ్యుల బాగోగులు చూసుకుంటామని ఉయ్యూరు శ్రీనివాస్‌ తెలిపారు. గాయపడిన వారికి పూర్తిగా వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు.