విజయవాడ, మే 6: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నూతన డీజీపీగా(AP New DGP) 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్ గుప్తా(Harish Gupta) నియామకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ(Election Commission) ఆదేశించింది. ఎన్నికల్లో పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి బదిలీచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చి, ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం
కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో, ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సిఫారసు చేసింది. అయితే, ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది.
హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకం నేపథ్యంలో, తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది.