Hyd, Jan 12: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు (IAS officer Somesh Kumar) తెలంగాణహైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ (Andhra Pradesh) కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది.ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఏపీలో 12వ తేదీ లోపు రిపోర్ట్ చేయాలని తెలిపింది. ఈ రోజు ఉదయం సోమేష్ కుమార్ విజయవాడకు చేరుకున్నారు.
విజయవాడలో సోమేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను. వీఆర్‌ఎస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతాను’ అని స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ. శాంతికుమారి నియమితులయ్యారు. రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్ కావడం విశేషం. 1989 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఆమె పేరును బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. శాంతికుమారి పదవీకాలం 2025 ఏప్రిల్ వరకు ఉంది. తన నియామకంపై సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. వెంటనే బీఆర్‌కే భవన్‌కు వచ్చి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.