Pawan Kalyan Serious on Janasena Activists in Farmers Meet File image of Pawan Kalyan | File Photo

Amaravati, Sep 29: గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan Slams YSRCP) మాట్లాడారు. తాను హీరోను కాదని, నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భాల్లో చెప్పానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనకుందని తెలిపారు. సినిమా అంటే ఇష్టమే అయినా గత్యంతరం లేక వచ్చా.. కానీ రాజకీయాల్లో బాధ్యతగా ఇష్టంగా వచ్చానని ప్రకటించారు. రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేయాలని వచ్చానని స్పష్టం చేశారు. తనకు ఏదో మెడల్ ఇస్తారనో తాను చేయనని పవన్ (janasena-chief Pawan Kalyan) చెప్పారు.

నేను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతా. టీడీపీకైనా బీజేపీకైనా (BJP) ఏపీ కోసమే మద్దతు ఇచ్చా. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి.. మాట్లాడటం రాదా మీకు?. ఓ పని చేయండి.. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి. నేను అడుగుతున్నది ఒకరి కష్టార్జితాన్ని మీరెవరు దోచుకోవడానికి అని అడిగా. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ (YSRCP) వారికే ఉన్నాయి. మహానుభావులకు తల వంచుతాం. మీలాంటి వారి తాట తీస్తాం. ఏదైనా అంటే అరుస్తారు.. మాట్లాడరు. ఏపీలో అభివృద్ధి లేదు. ఒక్క రోడ్డయినా వేశారా?’’ అని పవన్ ప్రశ్నించారు.

నువ్వు సైకోవి పవన్, రేపే నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా, జనసేనాధినేతపై మండిపడిన పోసాని కృష్ణమురళి, టీడీపీ శ్రేణులు చిరంజీవిని తిట్టినప్పుడు ఎక్కడున్నావు అంటూ ఫైర్

సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా. వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైకాపా వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.

వైసీపీ నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తాం. 2014లో టీడీపీ, బీజేపీకు కూడా అభివృద్ధి కోసమే మద్దతిచ్చా. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు. ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నాను. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

కేసీఆర్‌ని తిట్టాలంటే నీ ఫ్యాంట్లో కారిపోతాయి పవన్, నీ వకీల్ సాబ్ సినిమాకి ఏపీలో ఎంత వచ్చిందో తెలుసా, నువ్విచ్చే డబ్బులతో జగన్ ప్రభుత్వం ఏమైనా నడుస్తోందా, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన పేర్ని నాని

నేను సినిమా టికెట్ల గురించి మాత్రమే మాట్లాడా.. నాకేమీ సినిమా థియేటర్లు లేవు. మీ వైసీపీ నేతలకే థియేటర్లు ఉన్నాయి. నా మొదటి సినిమాకు మా బావ అరవింద్‌ రూ.5వేలు ఇచ్చారు. జానీ సినిమాకు తీసుకున్న డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేశా. మా కష్టార్జితంపై ప్రభుత్వం పెత్తనం ఏమిటని మాత్రమే అడిగాను. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాట్ల కుక్కల్లా అరుస్తున్నారు. వైసీపీ వాళ్లు సొంత డబ్బు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? సైనిక సంక్షేమ బోర్డుకు రూపాయైనా ఇచ్చారా? రూ.లక్ష కోట్లు సంపాదించినా ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చరు. ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు. భారతీ సిమెంట్‌ను అందరికీ ఉచితంగా పంచవచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పని వైకాపా వాళ్లకు సిగ్గుండాలి. వైకాపా నేతలు బెదిరిస్తే భయపడటానికి ఇడుపులపాయ ఎస్టేట్‌ కాదు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే ఓ మాట చెప్పా.

నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని ఆనాడే వైసీపీ వాళ్లకు చెప్పా. సర్కార్‌ అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికెళ్తున్నాయి. అధికార పార్టీ వద్ద కిరాయి ముఠాలు ఎన్ని ఉన్నా భయపడను. భగత్‌ సింగ్‌, బోస్‌, గాంధీలకు తలవంచుతా. వైసీపీ నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను అన్నారు.

నన్ను కూడా లాగావు పవన్, నీ వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని తెలిపిన మోహన్ బాబు, టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై మండిపడిన జనసేన అధినేత

‘‘కేంద్రంతో పోరాడదామంటే నన్ను గెలిపించ లేదు. విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడిని. వైకాపాకు ఓట్లేసి నన్ను పనిచేయమనడం భావ్యమా? అయినా నా శక్తి మేర పనిచేస్తా. పాతికేళ్లు జనంలో పనిచేస్తానని 2014లో చెప్పా. నన్ను గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా. ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడేలా శాంతిభద్రతలు కాపాడతా. కులాలకు సంబంధించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కులాలు ఐక్యంగా ఉండకపోతే ప్రజలే నష్టపోతారు. స్నేహానికైనా వైరానికైనా నేను సిద్ధమే. నా ఆర్థిక మూలాలు దెబ్బకొడతానంటే అభ్యంతరం లేదు. నన్ను కాపులతోనే కాదు అన్ని కులాలతో తిట్టించండి. ఏ కులం నూరు శాతం ఎవరితోనూ ఉంటుందని అనుకోను. కాపులు నాతో ఉంటే కాకినాడలో ద్వారంపూడి నన్నెలా తిట్టగలిగేవారు? కాపు ఉద్యమంలో వైకాపా వారే చొరబడి అలజడి సృష్టించారు. తుని రైలు ఘటనప్పుడు వైకాపా వర్గాలు అల్లర్లు రేపాయని సమాచారం.

కులాల తగాదాలతో రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం తగలబెట్టేస్తోంది. అమరావతిని కొనసాగించమని బీజేపీకు చెప్పా. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడా. ప్రత్యేక హోదా విషయంలో నాకు అండగా ఉండాల్సిన వారే బంధాలు వేశారు. వైసీపీ దుష్టపాలన అంతమొందించే సమయం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మార బోతున్నాయి. ఓడిపోతానని నేనూ అనుకోలేదు. వైసీపీ ఓడిపోతుందని వారు అనుకోకపోవచ్చు. ఊహించనివి జరగడమే ఎన్నికలంటే. ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైసీపీకు 15 సీట్లు రావచ్చుగా! వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వైసీపీ నాయకత్వానికి సవాల్‌ విసురుతున్నా. మీరా? మేమా? పెట్టుకుందాం రా.. అని సవాల్‌ చేస్తున్నా. వైకాపా వాళ్ల చిట్టాలు రాసి పెట్టుకోమని జనసేన కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. జనసేన గురించి మాట్లాడితే తోలుతీస్తామని చెప్పండి. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి చిట్టా కార్యకర్తలు రాసి పెట్టాలి. కాకినాడలో నాడు జనసేనపై చేసిన దాడిని మరిచిపోయే ప్రసక్తే లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. బిహార్‌ నుంచి కిరాయి మూకలను కావాలంటే తెప్పించుకోండి. వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోందని తెలిపారు.