Compensation for Lands: మా భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌ (Aswini Dutt) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు (Krishnam Raju) పిటిషన్‌ వేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం (Gannavaram Airport Expansion Row) కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం (Compensation For Lands) చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airport Authority of India) ప్రయత్నిస్తోందంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

Compensation for Lands: మా భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌
AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, Sep 29: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌ (Aswini Dutt) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు (Krishnam Raju) పిటిషన్‌ వేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం (Gannavaram Airport Expansion Row) కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం (Compensation For Lands) చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airport Authority of India) ప్రయత్నిస్తోందంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయం విస్తరణ కోసం తానిచ్చిన 39 ఎకరాల భూమికి గాను భూ సేకరణ చట్టం కింద రూ.210 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏఏఐని ఆదేశించాలని కోరుతూ నిర్మాత చలసాని అశ్వనీదత్‌ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీ వాయిదా, నవంబర్‌ 2న స్కూళ్లు తెరుస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

గన్నవరంలో తానిచ్చిన 39 ఎకరాల భూమి ప్రస్తుతం ఎకరా రూ.1.84 కోట్లు చేస్తుందని, భూ సేకరణ చట్టం కింద ఈ మొత్తానికి నాలుగు రెట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.

తన 39 ఎకరాలకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని అశ్వనీదత్‌ కోరారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ భూమి ఎకరానికి రూ. కోటి 54 లక్షల విలువ ఉందని తెలిపారు. ఈ భూమికి సరిసమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పుడు రాజధానిని వేరే చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఏపీలో అక్టోబర్ నెల‌లో రానున్న పథకాలు, స్పందన కార్యక్రమంపై అధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్ వీడియో కాన్పరెన్స్‌, కలెక్టర్లకు పలు సూచనలు

దీంతో అక్కడి భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని చెప్పారు. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ అశ్వినీదత్‌ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ వాల్యూ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందన్నారు. ల్యాండ్‌ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని పిటిషన్‌లో అశ్వినీదత్‌ పేర్కొన్నారు. అశ్వినీదత్‌ తరపున హైకోర్టులో న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ పిటిషన్‌ వేశారు.

(The above story first appeared on LatestLY on Sep 29, 2020 05:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).