devineni Uma (Photo-Facebook)

Amaravati, April 20: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్ఫింగ్ వీడియోలను (Devineni Uma Morphed Videos) ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు (Kurnool CID Police) చీటింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన ఇంట్లోలేరు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని తెలిపారు.

కాగా ఈ నెల 7న ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై ( tdp minister devineni uma) సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు.

రూ.128.47 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఏపీ సీఎం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటలను వక్రీకరిస్తూ మార్ఫింగ్‌ వీడియోతో తిరుపతి ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి.‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మార్ఫింగ్‌ వీడియోతో ఉమా ట్వీట్‌ చేశారు.

కాగా ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది. ఆరేళ్ల కాలంలో వేర్వేరు సందర్భాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఉమా ట్వీట్‌ చేశారని నిర్ధారించింది. మార్ఫింగ్‌ వీడియోకు ఆడియో కూడా సరిపోకపోవడంతో ఇది ఉద్దేశపూర్వంగా చేసినదేనని పేర్కొంది.

2014 ఏప్రిల్‌ 13న వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోను, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలోను సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన మీడియా సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్‌ చేసి వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్లు తేలింది. తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయడానికి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉమా మార్ఫింగ్‌ వీడియోతో చేసిన ట్వీట్‌పై చట్టపరమైన చర్యలకు ఫ్యాక్ట్‌ చెక్‌ తగిన ఆధారాలతో సంబంధిత అధికారులకు సిఫారసు చేసింది.

ఏపీలో మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, కరోనా నియంత్రణకు కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు, తాజాగా 5,963 మందికి కరోనా, 27 మంది మృతి

వాస్తవానికి ఆయా మీడియా సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోనున్న చర్యలు, వైద్య ఆరోగ్య విభాగంలో ఎక్కడైనా సరే మౌలిక వసతులు ఏర్పాటుచేయకుండా వైద్య నిపుణులు తిరుపతి, ఒడిశా, బిహార్‌లో ఉండటానికి ఇష్టపడరనే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. ఆయా వీడియోలను ఉమా ‘స్మార్ట్‌ ఎడిటర్‌’తో మార్ఫింగ్‌ చేశారని, వాటిలోని దృశ్యానికి ఆడియో అనుసంధానం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఫ్యాక్ట్‌ చెక్‌ తేల్చింది.

ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించిన దేవినేని ఉమ

ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం దేవినేని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలను పెంచేశార‌ని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని నిర్మూలించేందుకు తాము రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో జ‌గ‌న్ ప్రకటించార‌ని అందులో గుర్తు చేశారు.

అనంత‌రం టెండరింగ్‌, పనుల అప్పగింతలో అవకతవకల పరిశీలనకు ఓ నిపుణుల కమిటీని కూడా వేశారని, దాని సిఫారసుతో కాంట్రాక్టు సంస్థకిచ్చిన పనులను రద్దుచేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టులో మిగిలిన పనులతో పాటు పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులకు పిలిచిన టెండర్లలో రూ.780 కోట్లు ఆదా అయ్యాయని ఏపీ ప్ర‌భుత్వం చెప్పింద‌ని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయిని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఆయా అంశాల‌ను దేవినేని ఉమ ప్ర‌స్తావించారు.

'ఎన్నికల ముందు పోలవరం పునాదులు లేవలేదన్నారు. చంద్రబాబు నాయుడు 71 శాతం పనులు పూర్తిచేస్తే, జరుగుతున్న పనులను ఆపారు. రివర్స్ టెండరింగ్ అన్నారు.. ఆదా అన్నారు. మొత్తం రూ.3,222 కోట్లు అంచనా పెంచారు. ఇసుకకు రూ.500 కోట్లు అదనం. నిన్న ఒక్కరోజే రూ.2,569 కోట్లు పెంచారు. ఈ ‘మహాదోపిడీ’పై ప్రజలకు సమాధానం చెప్పాలి' అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.