Y. S. Rajasekhara Reddy Statue Demolition (Photo-Twitter)

Srikakulam, Oct 7: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని శ్రీ‌కాకుళం జిల్లా (Srikakulam) భామిని మండ‌లం కొర‌మలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వసం (Y. S. Rajasekhara Reddy Statue Demolition) చేశారు. విగ్రహాన్ని పెకిలించి వేసి దుండగులు కిందపడేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్‌ 2న డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు (Police) విచార‌ణ చేప‌ట్టారు. పాల‌కొండ ఎమ్మెల్యే వి.క‌ళావ‌తి, డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్‌ ఈ ఘటనను ఖండించారు. అయితే విగ్ర‌హం ఏర్పాటు విష‌యంలో గ్రామంలో ఎటువంటి వివాదం లేదని తెలిపారు.

ముగిసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం, కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల తుది నిర్ణయం అపెక్స్‌ కౌన్సిల్‌దే, ప్రెస్ మీట్‌లో పలు కీలక అంశాలను వెల్లడించిన కేంద్రమంత్రి షెకావత్

గతంలో కూడా విశాఖపట్నం జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. విశాఖపట్నం జిల్లా మంగళాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన ఓదార్పు యాత్రలో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మంగళవారం రాత్రి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రి దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు.