Knife representational image- Photo- ANI)

Chittoor,August 10: చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల విషయంలో (Land Dispute in Chittoor) ఓ మహిళపై సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో ( Papireddygaripalli) సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో తెగబడటంతో (Man Attack Opponent With Knife) ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గతంలో కూడా  చిత్తూరులో కత్తులతో దాడులు జరిగాయి. చిత్తూరుజిల్లా కార్వేటి నగరం మండలం డీఎం పురం గ్రామానికి చెందిన చిరంజీవి(35)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. కత్తిపోట్లకు గురైన చిరంజీవి అక్కడికక్కడే మరణించాడు. శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాల కారణంగానే హత్య జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రమాదం ఎలా జరిగింది? విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, రాష్ట్రం నుంచి రూ. 50 లక్షలు

ఇక 2118లో పట్టపగలే మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో కలకలం రేపిన సంగతి విదితమే. ఈ హత్య కూడా ఆస్తి గొడవల నేపథ్యంలో జరిగిందని వార్తలు వచ్చాయి.