Representational Image | (Photo Credits: IANS)

Amaravati, April 17: ఏపీలో ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కుమార్తె వెంట పడుతున్నాడనే కోపంతో యువకుడి మర్మాంగాలపై యువతి తండ్రి దాడి చేసి గాయపరిచాడు. జిల్లాలోని చట్రాయి మండలం నరసింహారావు పాలెంలో (Eluru District of Andhra Pradesh) ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి యువకుడిని ఇంటికి పిలిచి చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.

తన కూతురు వెంటపడుతున్నాడనే కోపంతో యువకుడు మర్మాంగాలపై (young man Private parts) రోకలి బండతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరో కథనం కూడా వినిపిస్తోంది. తన సోదరిపై ఫేస్ బుక్ లో అసభ్యకరంగా పోస్టులు చేశాడని యువతి సోదరుడు యువకుడిపై దాడిచేశాడు. మాట్లాడదామని ఇంటికి పిలిపించిన యువతి సోదరుడు అతడి మర్మాంగంపై దాడి చేశాడని తెలుస్తోంది.

కోడలిపై కన్నేసిన మామ, రూంలోకి లాక్కెళ్లి రాత్రంతా అత్యాచారం, నీమొగుడు లేని లోటు తీరుస్తానని, వినకుంటే కొడుకుని చంపేస్తానని బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పోలీసులు శ్రీకాంత్ పై దాడి జరగలేదని చెబుతున్నారు. అతడ్ని చీకటిగదిలో పెట్టి కొట్టారనడంలో నిజం లేదని.. పెద్ద మనుషుల సమక్షంలోనే చేయిచేసుకున్న మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని.. విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తే.. వాటిపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం చేతులతోనే శ్రీకాంత్ పై దాడి చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.