Dhone, March 19: నంద్యాల జిల్లా డోన్ లో సెల్ ఫోన్ పేలుడు (Mobile Phone Explodes) ఘటన కలకలం రేపింది. వివో సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వ్యక్తి చేతికి, తొడకి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్ నగర్ కాలనీకి చెందిన నాగేంద్ర.. పాత బస్టాండ్ దగ్గర టీ తాగాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. టీచర్స్ కాలనీలోని శారదా కాన్వెంట్ దగ్గరికి రాగానే ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా (Mobile Phone Explodes)పేలింది. బైక్ లో వెళ్తున్న సమయంలో అతడికి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ వెంటనే సెల్ ఫోన్ పేలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఫోన్ పేలడంతో నాగేంద్ర ఒంటిపై మంటలు వచ్చాయి. నాగేంద్ర ఒంటిపై మంటలను ఆర్పివేశారు. సెల్ ఫోన్ దూరంగా విసిరేశారు.
జేబులో ఉన్న సెల్ ఫోన్.. బాంబులా పేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బాధితుడితో పాటు స్థానికులు షాక్ కి గురయ్యారు. సెల్ ఫోన్ కంపెనీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? సెల్ ఫోన్ ఎందుకు పేలింది? (Mobile Phone Explodes) కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రోజుల్లో ఫోన్.. మనిషి జీవితంలో భాగమైపోయింది. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. అనే తేడా లేదు. దాదాపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అన్ని పనులు ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. దీంతో వాటి మీద బాగా డిపెండ్ అయిపోయారు.
Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వీడియోతో
ఫోన్ కొనుగోలు దగ్గరి నుంచి వినియోగం వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాసిరకం ఉత్పత్తులు తీసుకున్నా, సరిగ్గా వినియోగించకపోయినా ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, ఫోన్ పేలిపోతున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.