COVID-19 Outbreak in India | File Photo

Amaravati, September 22: కోవిడ్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం (Narendra Modi Govt) ఇప్పటివరకు రూ. 200 కోట్ల నిధులను (COVID Funds to AP) అందించిందని.. మరో 58.4 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని కేంద్రం తెలిపింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే (Ashwini Kumar Choubey) ఈ మేరకు సమాధానం అందించారు.

ఏపీలో కరోనా నియంత్రణ కోసం కేంద్రం ఎలాంటి ఆర్థిక సహకారం అందిస్తుందనే విషయాన్ని పరిమళ్ నత్వానీ (Parimal Nathwani) రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తొలి దశలో రూ. 3000 కోట్లు, రెండో దశలో 1256.81 కోట్లు అందించినట్టు కేంద్రం తెలిపింది.

ఈ క్రమంలోనే ఏపీకి తొలి దశలో రూ. 141.46 కోట్లు, రెండో దశలో 116.82 కోట్లు వచ్చాయి. రెండో దశకు సంబంధించి 58.41 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించింది. కేంద్రం నుంచి రూ. 3.10 కోట్ల విలువైన యంత్రాలను కూడా సమకూర్చింది. ఇక ఏపీకి సెప్టెంబర్ 11 నాటికి కోటి 87 లక్షల విలువ చేసే లక్షా 70 వేల ఆర్ఎన్ఏ కిట్స్ కేంద్రం నుంచి వచ్చాయని కేంద్రం తెలిపింది. వీటితో పాటు కోటి 68 లక్షల విలువ చేసే లక్షా 22 వేల వీటీఎమ్ మెషిన్లు, 13 కోట్ల రూపాయల విలువ చేసే 2 లక్షల 46 వేల 567 ఆర్టీ పీసీఆర్ కిట్లు ఏపీకి కేంద్రం నుంచి వచ్చాయని మంత్రి తెలిపారు.

హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ, రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య చర్చలు, ఏపీలో ఫోరెన్సిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరిన విజయసాయి రెడ్డి

వీటితో పాటుగా ఏపీకి కేంద్రం 14.63 లక్షల ఎన్95 మాస్కులు, 2,79 పీపీఈ కిట్లు, 31.5 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు, 3960 వెంటిలేటర్లు అందించిందని గుర్తు చేశారు. కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు సంపూర్ణ సహాకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకోసం రూ. 15000 కోట్ల ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.